ఏపీలో విచిత్ర పరిస్థితి... వైసీపీ సర్కార్‌కు రిలీఫ్

శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల గొడవ కారణంగా కీలక బిల్లులు ఆమోదం పొందకుండానే సభ నిరవధికంగా వాయిదా పడింది.

news18-telugu
Updated: June 18, 2020, 6:54 AM IST
ఏపీలో విచిత్ర పరిస్థితి... వైసీపీ సర్కార్‌కు రిలీఫ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఖర్చులకు, ఆర్థిక లావాదేవీలకు కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. దీంతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లు, మూడు రాజధానుల బిల్లులు కూడా ఆమోదం పొందలేదు. రాజధాని బిల్లులపై ఒక నెల తరువాత చట్టం చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది. ఇదిలా ఉంటే ద్రవ్య వినిమయ బిల్లుకు చట్టబద్ధత లభించకపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. సాధారణంగా ఉభయ సభలు ఆమోదిస్తేనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది.

అయితే శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల గొడవ కారణంగా ఈ బిల్లులు ఆమోదం పొందకుండానే సభ నిరవధికంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందు మూడు మార్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోసారి మండలిని సమావేశపరిచి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపజేసుకోవడం, గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించి సమస్యను అధిగమించడం చేయొచ్చని సమాచారం. అయితే ద్రవ్య బిల్లు 14 రోజుల్లో మండలి నుంచి రాకపోతే దానంతట అదే ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో 14 రోజుల తరువాత దీనిపై ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: June 18, 2020, 6:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading