కాదెవరు హ్యాకింగ్ కు అనర్హం అన్నట్టు హ్యకర్లు వాళ్ల అవసరాల కోసం ఎంతకైన తెగిస్తారు. వ్యక్తుల నుండి సముహాల వరకు హ్యకింగ్ చేసి ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేయడమే వారి లక్ష్యం. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఏపీ ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతాను హ్యాక్ గురి చేశారు. హ్యాకింగ్ చేసి అందులో ఆశ్లీల చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని మరో ట్వీట్ ద్వార స్యయంగా మంత్రి వెల్లడించారు.
ఆయన ఐటి శాఖకే మంత్రి అయినా...ట్విట్టర్ ఖాతా మాత్రం హ్యాక్ కు గురైంది. హ్యాకర్లు మంత్రి ట్విట్టర్ ఖాతాలో ఆశ్లీల చిత్రాలను పోస్ట్ చేశారు. అయితే హ్యాకింగ్ గురైన కొద్ది రోజులకు తాను గుర్తించినట్టు మంత్రి తెలిపారు. దీంతో వెంటనే ఆ చిత్రాలను తొలగించినట్టు చెప్పారు. అనంతరం ట్విట్టర్ సంస్థతో పాటు ఏపీ పోలీసులకు కూడ ఫిర్యాధు చేసినట్టు చెప్పారు. ఈ సంధర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆశ్లీల చిత్రాలు వచ్చినందుకు తన ఫాలోవర్స్ ఆయన క్షమాపణలు చెప్పారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.