AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఇంటర్ సప్లిమెంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను (AP Inter Supplementary Results) అధికారులు తాజాగా విడుదల చేశారు. విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఫలితాలను (AP Inter Results) చూసుకోవచ్చు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం రూ. 260, రీ వాల్యుయేషన్, స్కాన్ కాపీని పొందడం కోసం రూ. 1300లను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అధికారులు ఈ రోజు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాలకు చెందిన జనరల్, ఒకేషనల్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు ఈ కింది లింక్ ల ద్వారా ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    AP Inter Supplementary Results Direct Links:
    -విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
    -ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ రిజల్ట్స్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
    -ఇంటర్ సెకండియర్ జనరల్ రిజల్ట్స్ ను ఈ లింక్ ద్వారా చూసుకోవచ్చు.
    -ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ ను ఈ లింక్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.

    ఇదిలా ఉంటే ఈ సారి ఒకేషనల్ తో పాటు కొన్ని సబ్జెక్టులను ఆన్లైన్(ఆన్ స్క్రీన్) విధానంలో మూల్యాంకనం చేశారు. రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఆన్లైన్ విధానంలోనే జవాబు పత్రాలను అందించనున్నారు. విద్యార్థులు షార్ట్ మెమోలను ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published: