AP Inter supplementary : నేటి నుంచే ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్..

AP Inter supplementary : ఈ పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణతో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: May 14, 2019, 4:14 AM IST
AP Inter supplementary : నేటి నుంచే ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ( మే 14 ) నుంచీ జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 4,24,500 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో లక్షా 75వేల మంది ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలవరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణతో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలు జూన్ మొదటివారంలో విడుదలవుతాయి.

 

ఇవి కూడా చదవండి..

Govt Jobs : పదోతరగతి అర్హతతోనే బోర్డర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

Indian Navy Jobs : టెన్త్ చదివితే చాలు.. ఇండియన్ నేవీలో జాబ్స్.. జీతం.. రూ.50 వేలు
First published: May 14, 2019, 4:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading