హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Inter Second Year Results: నేడే విడుదల.. ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలను ప్రకటించనున్న ప్రభుత్వం.. రిజల్ట్స్ కోసం..

AP Inter Second Year Results: నేడే విడుదల.. ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలను ప్రకటించనున్న ప్రభుత్వం.. రిజల్ట్స్ కోసం..

ఏపీలోని పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 4న ఫలితాలు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.

ఏపీలోని పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 4న ఫలితాలు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.

ఏపీలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను ప్రభుత్వం ఇవాళ(శుక్రవారం) ప్రకటించనుంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్నెట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.

ఇంకా చదవండి ...

విజయవాడ: ఏపీలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను ప్రభుత్వం ఇవాళ(శుక్రవారం) ప్రకటించనుంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్నెట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. పరీక్షా ఫలితాలను http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, http://bie.ap.gov.in వెబ్‌సైట్లలో ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈ వెబ్‌సైట్లలో పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు. ఏపీలో ఇంటర్ పరీక్షలపై అప్పట్లో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం, పరీక్షలు రద్దు చేయాలని విపక్షాలు, విద్యార్థి సంఘాలు.. ఇలా ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారా లేదా రద్దు చేస్తారా అన్న మీమాంస మధ్య సుప్రీం కోర్టు సూచనతో ఏపీ ప్రభుత్వం పరీక్షల రద్దుకే మొగ్గు చూపక తప్పలేదు. ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనలు, సలహాల కోసం ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్ ఫస్టియర్‌తో పాటు టెన్త్, సెకండియర్ ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయినప్పటికీ థియరీ పరీక్షలు కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగకుండా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో రద్దయిన సంగతి తెలిసిందే. ఏపీలో మొత్తం 10,32,469 మంది మార్చి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు రిజిస్టర్ కాగా.. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 5,12,959 మంది, సెకండియర్ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు.

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్న ప్రభుత్వం.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంసెట్‌ను ఆగస్ట్ 19 నుంచి 25 వరకూ నిర్వహించనున్నట్లు ఏపీ విద్యా శాఖ తెలిపింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ను సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

First published:

Tags: Andhra Pradesh, Ap intermediate results, EDUCATION, Exam results, Students

ఉత్తమ కథలు