AP Inter results Re counting and Re verification process: ఏపీ ఇంటర్ ఫలితాలు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇలా చేయండి

AP Inter results Re counting and Re verification process: తమకు వచ్చి మార్కుల పట్ల అంతగా సంతృప్తి చెందని విద్యార్థులు... రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను కూడా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసింది.

news18-telugu
Updated: April 13, 2019, 8:44 AM IST
AP Inter results Re counting and Re verification process: ఏపీ ఇంటర్ ఫలితాలు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇలా చేయండి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 13, 2019, 8:44 AM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. అయితే ఫలితాల్లో ఉత్తర్ణీత సాధించని విద్యార్థులు, తమకు వచ్చి మార్కుల పట్ల అంతగా సంతృప్తి చెందని విద్యార్థులు... రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను కూడా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్‌కు సంబంధించి ఒక్కో పేపర్ రీ కౌంటింగ్ కోసం రూ. 260 ఫీజు చెల్లించాలి.

రీ వెరిఫికేషన్, స్కానింగ్ కాపీ కొరకు రూ. 1,300 చెల్లించాలి.

ఇందుకు సంబంధించిన ఫీజును ఆన్‌లైన్‌లో APCFSS Website http://apbie.apcfss.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి చెల్లించాల్సి ఉంటుంది.



ఆన్‌లైన్‌లో రీ వెరిఫికేషన్‌కు అప్లై చేసుకున్న తరువాత http://apbie.apcfss.in‌ వెబ్ సైట్‌కు లాగిన్ అయిన స్కానింగ్ కాపీ తీసుకోవాలి.

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఫీజుతో పాటు ఇంటర్మీడియట్ హాట్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, టెన్త్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. ఆ వెంటనే విద్యార్థికి సంబంధించి వివరాలు కనిపిస్తాయి.
Loading...
ఆ తరువాత తాను ఏ సబ్జెక్ట్ కోసం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను పూర్తిస్థాయిలో నింపాలి.


ఆన్‌లైన్‌లో రీ వెరిఫికేషన్‌కు అప్లై చేసుకున్న తరువాత http://apbie.apcfss.in‌ వెబ్ సైట్‌కు లాగిన్ అయిన స్కానింగ్ కాపీ తీసుకోవాలి.

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన ఫీజు చివరి తేదీ 22-04-2019.

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం చెల్లించిన ఫీజుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రీ ఫండ్ ఉండదు



First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...