AP Inter Result 2019 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. News18లో చెక్ చేసుకోండి..

Andhra Pradesh Intermediate Result 2019, 1st year and 2nd year exam results : నేటి ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులు రెండింటికి కలిపి ఉమ్మడిగా ఫలితాలు విడుదల చేశారు.

news18-telugu
Updated: April 12, 2019, 2:01 PM IST
AP Inter Result 2019 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. News18లో చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ బోర్డ్ కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేశారు. ఫస్టియర్‌లో 60శాతం ఉత్తీర్ణత, సెకండియర్‌లో 72శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో 13,966 మందికి 10/10 గ్రేడ్ వచ్చింది. సెకండియర్‌లో 9,340మందికి 10/10 గ్రేడ్ వచ్చింది.ఈసారి ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో చిత్తూరు-76%, నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు 73శాతంతో ఉన్నాయి. అలాగే ఎప్పటిలాగే ఈసారి ఫలితాల్లో కూడా 75శాతం ఫలితాలతో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇక ప్రభుత్వ కాలేజీల ఫలితాలను పరిశీలిస్తే.. 77శాతం ఉత్తీర్ణతతో విజయనగరం జిల్లా టాప్‌లో నిలిచింది. 70శాతంతో చిత్తూరు జిల్లా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.


ఫస్టియర్‌లో మొత్తం 4,76,419 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,86,889మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే సెకండియర్‌లో 4,31,739 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 3,09,613 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫస్టియర్ ఒకేషనల్‌లో 30,886 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 15,044మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ ఒకేషనల్‌లో 26,552మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 18,409మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 14న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 24న చివరి తేదీ అని తెలిపారు.

కాగా, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకూ సెకండియర్ పరీక్షలు జరిగాయి. మొత్తం 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,07,302 మంది విద్యార్థులు హాజరుకాగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,10,298 మంది విద్యార్థులు హాజరయ్యారు.

AP intermediate results declared, 60%pass in First year and 72% in second year


Amarvathi : AP intermediate examination results for first year and second year announced today. Intermediate exams-2019 Results declared by the secretary of board of intermediate education B.Udaya Lakshmi today in a press conference at amarvathi secratariat.

As per the announcement 60 % of the students, those who appeared for first year have passed. And 72% of the second year students passed in the examinations held in February to March, 2019. Around 8.5 lakshs students has written both 1st and 2nd year examinations.For the first time intermediate board has announced the results in grading method. Results are announced in a record time of 25 days after the conclusion of examinations.
The AP board of intermediate education has given 10 days time for applying for recounting of examination papers and scanned of answer sheets. The advanced supplimentary examinations will be held from 14th may, 2019.



WEB TITLE: AP Inter Results 2019, AP Intermediate Results here, Check Your AP Inter Results, AP Inter Results On News18 Telugu, AP Inter First Year Second Year Results, AP Intermediate Board, Manabadi

ఇది కూడా చదవండి : AP Inter results Re counting and Re verification process: ఏపీ ఇంటర్ ఫలితాలు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇలా చేయండి
First published: April 12, 2019, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading