టీడీపీ ఫిర్యాదుతో దిగొచ్చిన జగన్... అందుకే ఆ నిర్ణయం ?

రెండు రోజల క్రితం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటిలిజెన్సీ చీఫ్ విశ్వజిత్ కావడం... ఆ వెంటనే విశ్వజిత్ బదిలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: December 5, 2019, 3:17 PM IST
టీడీపీ ఫిర్యాదుతో దిగొచ్చిన జగన్... అందుకే ఆ నిర్ణయం ?
ఏపీ సీఎం జగన్
  • Share this:
ప్రభుత్వంలో పని చేసే ఉన్నతాధికారుల బదిలీలు జరగడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు కీలకమైన స్థానాల్లో ఉండే అధికారుల బదిలీలు చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ ఛీప్ విశ్వజిత్ సేన్ బదిలీ కూడా ఏపీలో సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. రాష్ట్రానికి ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్‌ అధికారిగా ఉన్నటువంటి విశ్వజిత్ స్థానంలో నూతనంగా మనీశ్ కుమార్ సిన్హాను నియమించింది. ఈమేరకు విశ్వజిత్‌ను రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2000 బ్యాచ్‌కి చెందిన మనీశ్ కుమార్ రాష్ట్రంలో త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. వీరితో పాటు మరికొందరు ఉన్నతాధికారులను కూడా ఏపీ ప్రభుత్వం బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

అయితే రెండు రోజల క్రితం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటిలిజెన్సీ చీఫ్ విశ్వజిత్ భేటీ కావడం... ఆ వెంటనే విశ్వజిత్ బదిలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుపై దాడి ఘటన విషయంలో ఇంటెలిజెన్స్ సరిగ్గా వ్యవహరించలేదనే కారణంతో సీఎం జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా ? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖకు సైతం టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ కారణంగానే ఇంటలిజెన్స్‌ చీఫ్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసిందేమో అనే టాక్ వినిపిస్తోంది.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>