AP IAS TRANSFERS IN CM JAGAN MOHAN REDDY GOVERNMENT DECISION MK
AP IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ...జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం...
సమీక్షా సమావేశంలో సీఎం జగన్
AP IAS Transfers : ఏపీలో పాలనపై పట్టు సాధించేందుకు సీఎం జగన్ నడుం బిగించారు. . మొత్తం 22 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లా కలెక్టర్లతో పాటు, కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డైరెక్టర్ల బదిలీలు జరిగాయి.
AP IAS Transfers | ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో పట్టు సాధించే దిశగా తొలి అడుగు వేశారు. ఇందులో భాగంగా ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. మొత్తం 44 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లా కలెక్టర్లతో పాటు, కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డైరెక్టర్ల బదిలీలు జరిగాయి.
బదిలీ అయిన అధికారులు వివరాలు ఇలా ఉన్నాయి :
సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా- విజయ
ట్రాన్సపోర్ట్ కమిషనర్‌గా- పీఎస్సార్ ఆంజనేయులు
హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్‌గా- చిరంజీవి చౌదరి
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా- పీయూష్ కుమార్
ఇంటర్ విద్య కమిషనర్‌గా- కాంతిలాల్ దండే
మున్సిపల్ శాఖ కమిషనర్‌గా- విజయ్ కుమార్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా- గిరిజా శంకర్
సీఆర్డీఏ కమిషనర్‌గా- లక్ష్మీ నరసింహం
విజయానంద్, అజేయ్ జైన్ జీఏడీకి అటాచ్
ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- జేఎస్వీ ప్రసాద్
ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- నీరబ్ కుమార్ ప్రసాద్
జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- ఆదిత్యనాథ్ దాస్
వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- పూనం మాలకొండయ్య
బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- కరకాల వలవన్
పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా- రజత్ భార్గవ.
వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా- జవహర్ రెడ్డి
గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా- అనంత రాము
యూత్ సర్వీసెస్, టూరిజం ముఖ్య కార్యదర్శిగా- ప్రవీణ్ కుమార్
పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా- రాజశేఖర్
ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా- కృష్ణబాబు
స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా- దయమంతి
పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా- శ్యామలరావు
ట్రాన్స్ కో ఎండీగా- నాగులాపల్లి శ్రీకాంత్
సివిల్ సప్లైస్ కమిషనరుగా- కోన శశిధర్
హోం సెక్రటరీగా- కిషోర్ కుమార్
వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా- మధుసూదన్ రెడ్డి
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా- ఆర్పీ సిసోడియా
శాప్ ఎండీగా- కాటంనేని భాస్కర్
మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్‌గా- ప్రద్యుమ్న
ఎక్సైజ్ కమిషనర్- ఎం ఎం నాయక్
సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా- హర్షవర్ధన్
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా- ప్రవీణ్ కుమార్
సీఎం ఓఎస్డీగా- జె మురళీ
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా- ఎంకే మీనా
జెన్కో ఎండీగా- బి. శ్రీధర్
ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా- వెంకటేశ్వర ప్రసాద్
బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు...
నెల్లూరు- ఎంవీ శేషగిరిబాబు
అనంతపురం- ఎస్ సత్యనారాయణ
విశాఖపట్నం- వి వినయ్‌చంద్
కర్నూలు- జి వీరపాండ్యన్
చిత్తూరు- నారాయణ భరత్ గుప్తా
ప్రకాశం- పి భాస్కర్
తూర్పు గోదావరి- మురళీధర్‌రెడ్డి
పశ్చిమ గోదావరి- ముత్యాల రాజు
గుంటూరు- శ్యామూల్ ఆనంద్
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.