HOME »NEWS »ANDHRA PRADESH »ap ias officer srilakshmi gets promoted as special secretary sk

Sri Lakshmi: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Sri Lakshmi: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
శ్రీలక్ష్మి

శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని, తుది తీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

  • Share this:
    ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చింది. ఇటీవలే ఆమె పురపాలక శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐతే తాజాగా ఆమెను కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని, తుది తీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. శ్రీలక్ష్మి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యి.. ఏపీ కేడర్ లో చేరారు. క్యాట్ ఆదేశాల మేరకు ఆమెను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. డిప్యుటేషన్ మీద ఆమె తెలంగాణ నుంచి ఏపీకి రావాలని ఆమె తొలుత భావించిప్పికీ.. అది కుదరలేదు. క్యాట్‌ను ఆశ్రయించి.. శ్రీలక్ష్మి తన కేడర్‌ను ఏపీకి మార్పించుకున్నారు.




    రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మిని కేంద్రం తెలంగాణకు కేటాయించింది. వాస్తవానికి ఆమె స్వస్థలం విశాఖపట్నం. హైదరాబాద్ పోస్టల్ అడ్రస్ కారణంగా కేంద్రం ఆమెను తెలంగాణకు కేటాయించింది. అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేశారు. ఐతే 2014లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కావడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో శ్రీలక్ష్మీ మళ్లీ ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఏపీకి పంపేందుకు కేంద్రం నిరాకరించింది. ఐతే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(CAT)ను ఆశ్రయించిన ఆమె.. పోస్టల్ అడ్రస్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి రైల్వే జాబ్ కారణంగా.. తాము హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందని.. తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. డిప్యూటేషన్ కోసం ఏడాదిన్నరగా యత్నిస్తున్నా.. సెక్రటరీ స్థాయి అధికారులను అలా పంపడం కుదరదని స్పష్టం చేసింది. చివరకు క్యాట్ ను ఆశ్రయించి విజయం సాధించారు. క్యాట్ అదేశాలతో తెలంగాణ కేడర్ ఐఏఎస్ గా ఉన్న ఆమె ఏపీకి బదిలీ అయ్యారు.
    Published by:Shiva Kumar Addula
    First published:January 18, 2021, 22:22 IST

    टॉप स्टोरीज