హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: అందరికీ ఆదర్శం ఈ ఐఏఎస్.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చిన శాప్ ఎండీ..

AP News: అందరికీ ఆదర్శం ఈ ఐఏఎస్.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చిన శాప్ ఎండీ..

పిల్లల్ని స్కూల్లో చేర్పించిన ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మి

పిల్లల్ని స్కూల్లో చేర్పించిన ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మి

సాధారణంగా ప్రముఖులు, ఉన్నతాధికారులు తమ పిల్లల్ని పెద్ద పేరున్న స్కూళ్లలో చేర్పిస్తుంటారు. లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పంపుతుంటారు. అలాంటి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలవైపు చూడరన్న ప్రచారమూ లేకపోలేదు.

సాధారణంగా ప్రముఖులు, ఉన్నతాధికారులు తమ పిల్లల్ని పెద్ద పేరున్న స్కూళ్లలో చేర్పిస్తుంటారు. లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పంపుతుంటారు. అలాంటి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలవైపు చూడరన్న ప్రచారమూ లేకపోలేదు. ఐతే ప్రభుత్వ బడుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చదువు అందుతుందని.. అక్కడ మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయని నిరూపించేందుకు ఓ అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ ఐఏఎస్ అధికారి మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఏపీ ఐఏఎస్ ఆఫీసర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడ (Vijyawada) పడమటలోని జిల్లా పరిషత్ స్కూల్లో చేర్పించారు.

మంగళవారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో స్కూళ్లను తెరిచారు. దీంతో ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మీ.. తన ఇద్దరు పిల్లలను స్కూల్ కు తీసుకెళ్లి అడ్మిషన్ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు చక్కగా ఉండటం, క్లాస్ రూమ్, ప్లే గ్రౌండ్స్ అన్నీ అభివృద్ధి చేయడంతో తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించినట్లు ఆమె తెలిపారు.

ఇది చదవండి: డ్రెయినేజీలో దూకిన వైసీపీ ఎమ్మెల్యే.. అధికారులకు షాకింగ్ ట్రీట్ మెంట్..


గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి.. అప్పుడు కూడా తన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివించారు. గతేడాది తన కుమార్తె ఎన్‌.అలెక్స్ శృతిని పొద‌ల‌కూరు రోడ్డులోని ద‌ర్గామిట్ట జెడ్పీ ఉన్న‌త పాఠ‌శాల‌లో, కుమారుడు ఎన్‌.క్రిష్ ధ‌ర‌ణ్‌రెడ్డిని వేదాయ‌పాళెం స్పిన్నింగ్ మిల్లు కాల‌నీ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఇది చదవండి: ప్లీనరీకి విజయమ్మ రాకపై సస్పెన్స్..! వైసీపీలో జోరుగా చర్చ..!


ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న ఆర్.కూర్మనాథ్ గతంలో తన కుమారుడ్ని ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. పార్వతీపురం పట్టణంలోని కేపీఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడ్ని చేర్పించారు. స్వయంగా తానే అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చారు. గతంలో శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పనిచేసిన సందర్భంలోనూ ఆయన తన కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నాడు-నేడు పేరుతో అభివృద్ధి చేసింది. పాఠశాలల రూపురేఖలు మారిపోయి కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. దీనికి తోడు ఇంగ్లిష్ మీడియం కూడా అందిస్తుండటం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి. ఇలా అధికారులు కూడా తమ పిల్లలను సర్కారీ బడులకు పంపుతుండటంతో సాధారణ ప్రజలు మరింత స్ఫూర్తి పొందే అవకాశముంది.

First published:

Tags: Andhra Pradesh, AP Schools, Vijayawada

ఉత్తమ కథలు