'మహిళా ఉద్యోగినిపై దాడి' ఘటనపై హోంమంత్రి సుచరిత రియాక్షన్ ఇదే

నెల్లూరులోని టూరిజం ఆఫీసులో కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడిచేసిన విషయం తెలిసిందే. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు ఇనుప రాడ్‌తో ఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టాడు.

news18-telugu
Updated: June 30, 2020, 10:57 PM IST
'మహిళా ఉద్యోగినిపై దాడి' ఘటనపై హోంమంత్రి సుచరిత రియాక్షన్ ఇదే
ఏపీ హోంమంత్రి సుచరిత
  • Share this:
నెల్లూరులో మహిళా ఉద్యోగినిపై దాడి ఘటన సంచలన రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి సుచరిత స్పందించారు. మహిళా ఉద్యోగినిపై దాడి జరగడం చాలా బాధాకరమని ఆమె అన్నారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని చెప్పారు. దాడి చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేశామని, కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

నెల్లూరు ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాం. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దిశ చట్టం అమలులోకి వస్తే జరిగే మేలు గురించి ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. త్వరితగతిన ముద్దాయిలకు శిక్ష పడేలా దిశ చట్టం రూపొందించాం. దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వన్ స్టాప్ సెంటర్లను బలోపేతం చేశాం. నేరం చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.
సుచరిత, ఏపీ హోంమంత్రినెల్లూరులోని టూరిజం ఆఫీసులో కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడిచేసిన విషయం తెలిసిందే. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు ఇనుప రాడ్‌తో ఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. దివ్యాంగురాలని కూడా చూడకుండా ఆమెను చితకబాదాడు. ఈఘటనలో ఉషారాణికి గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
First published: June 30, 2020, 10:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading