ఏపీలో విద్యుత్ బిల్లుల గందరగోళంపై హోంమంత్రి వివరణ

ప్రతీకాత్మక చిత్రం

బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పూర్తి పారదర్శకంగా ఉందని హోంమంత్రి సుచరిత తెలిపారు.

  • Share this:
    ఏపీలో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయన్న అంశంపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు.మీటర్ రీడింగ్‌లను స్కానింగ్ పద్దతిలో తీయడం వలన మానవతప్పిదాలకు తావులేదని ఆమె తెలిపారు. మార్చ్ నెల పవర్ బిల్ ను గతంలో ఏ విధంగా చేశారో అదే విధానాన్ని అనుసరించారని... ఏప్రిల్ నెల బిల్లులో మాత్రం డైనమిక్ బిల్లింగ్ విధానాన్ని అనుసరించారని ఆమె తెలిపారు. దీని వలన వినియోగదారుడికి మంచే జరుగుతుందని హోంమంత్రి వివరించారు. గతంలో 1A, 1B, 1C స్లాబ్ యూనిట్ ప్రకారం బిల్స్ వచ్చేవని... ఇప్పుడు మాత్రం విద్యుత్ ఎంత ఉపయోగిస్తే అంతకు మాత్రమే బిల్ వస్తున్నాయని అన్నారు.

    ఈ విధానం వినియోగదారులకు మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లుల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఆమె అధికారులను ఆరా తీశారు. కరంట్ బిల్లుల గురించి హోంమంత్రి సుచరితకు అధికారులు వివరించారు. బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పూర్తి పారదర్శకంగా ఉందని మంత్రి తెలిపారు.

    Ap electricity bills,Andhra Pradesh,electricity,ap news,check electricity bills online in telugu,electricity bill,reduce your electriciy bill,electricity bill checking,lower your electricity bill,poor man got 128 crores of electricity bill,128 crores electricity bill to a poor man,electricity bill increase if ac not serviced,up man asked to pay rs 128 crore electricity bill,how to know electricity bill online in telugu,ఏపీ విద్యుత్ బిల్లులు,ఆంధ్రప్రదేశ్,ఏపీ న్యూస్
    ఏపీ హోంమంత్రి సుచరిత (ఫైల్ ఫోటో)


    ఏ నెలలో ఎంత వినియోగం చేస్తారో అంతకు మాత్రమే బిల్ వస్తుందని అన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారని.. దీని వలన విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని వెల్లడించారు. లాక్ డౌన్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజలకు వెసలుబాటు కల్పించిందని... బిల్లులు చెల్లించలేని వారికి జూన్ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చిందని హోంమంత్రి సుచరిత అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: