AP Temple Attacks : ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు... మరో ఘటన...

AP Hindu Temple Attacks : నెల్లూరులో జరిగిన ఘటనపై ఓవైపు దర్యాప్తు జరుగుతుంటే... మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన దారుణం కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: February 15, 2020, 10:56 AM IST
AP Temple Attacks : ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు... మరో ఘటన...
AP Temple Attacks : ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు... మరో ఘటన...
  • Share this:
AP Hindu Temple Attacks : ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యంగా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో కలకలం రేగింది. గ్రామంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని దుండగులు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో ఓ వైపు అమ్మవారి జాతర కోసం ఉత్సవ ఏర్పాట్లు జరుగుతుంటే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అమ్మవారి ఆలయ ముఖద్వారం కూల్చివేతపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు రాసి దర్యాప్తు మొదలుపెట్టారు.

AP Temple Attacks : ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు... మరో ఘటన...
AP Temple Attacks : నెల్లూరు జిల్లాలో తగలబడిన రథం


శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. నెల్లూరు జిల్లా... బోగోలు మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పుపెట్టారు దుండగులు. పెద్ద మంట వచ్చేలా నిప్పు పెట్టి పారిపోయారు. వెంటనే పెద్ద మంటలు వచ్చి రథం మొత్తం కాలిపోయింది. మంటల్ని ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించేలోపే... రథం మొత్తం కాలిపోయింది. దీనికి కారణం మీరంటే మీరు అంటూ రెండు వర్గాల ప్రజలు తిట్టిపోసుకున్నారు. వారిని శాంతపరిచిన పోలీసులు... ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే... ఆ పని చేసింది అతనేనా లేక ఇంకెవరైనానా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు త్వరలో పూర్తి వివరాలు చెబుతామని తెలిపారు.

AP Temple Attacks : నెల్లూరు జిల్లాలో తగలబడిన రథం
AP Temple Attacks : నెల్లూరు జిల్లాలో తగలబడిన రథం




మరోవైపు ఈ ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్‌గా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు. అలానే ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆకతాయిలు, దుండగులు చేస్తున్న ఇలాంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల పరిరక్షణకు YCP ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

కొండబిట్రకుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 5 నుంచీ వారం పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో... భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో కొత్త రథం తయారీకి సమయం తక్కువగా ఉండటంతో... ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తున్నారు. తయారీదారులతో మాట్లాడి... వీలైనంత త్వరగా కొత్త రథాన్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు... భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు