• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • AP HIGHCOURT ON THIRUMAL THIRUPATHI DEVASTHANAM ASSETS DEAD LINE TO 5 DAYS NGS

Andhra Pradesh: టీటీడీ ఆస్తుల లెక్క ఐదు రోజుల్లో చెప్పాలి : తిరుమల ఆస్తులపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Andhra Pradesh: టీటీడీ ఆస్తుల లెక్క ఐదు రోజుల్లో చెప్పాలి : తిరుమల ఆస్తులపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

తిరుమల క్షేత్రం

టీటీడీ ఆస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమల వెబ్ సైట్ లో ఉన్న ఆస్తుల విలువను అఫిడవిట్ లో దాఖలు చేయాలని హైకోర్టు కోరింది. అందుకు ఐదు రోజులు గడువు ఇస్తూ విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.

  • Share this:
    కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీకి చెందిన ఆస్తుల వివరాలను ఐదు రోజుల్లో అఫిడవిట్ రూపంలో అందించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియజేయాలని హైకోర్టు  స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. దీంతో టీటీడీకి సంబంధించిన ఆస్తుల వివరాలను ఐదు రోజుల్లో హైకోర్టుకు అఫడవిట్ లో బోర్డు సమర్పించాల్సి ఉంటుంది.

    టీటీడీ ఆస్తులను కాపాడాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది యలమంచిలి బాలాజీ తమ వాదనలు వినిపించారు. టీటీడీ భూములు, బంగారం ఇతర ఆభరణాలు విక్రయించకుండా చూడాలని ఆయన కోర్టును కోరారు. ఒకవేళ ఆస్తులను తప్పని సరి పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తే.. పబ్లిక్ ఆక్షన్ ద్వారానే అమ్మాలే చర్యలు తీసుకోవాలి అన్నారు. అలాగే టీటీడీ ఆస్తులను ఇతర మతస్తులకు కాకుండా కేవలం హిందూవులకు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. దీంతోపాటు ప్రస్తుతం తిరుమల ఆస్తులను పబ్లిక్ డొమైన్ లో పెట్టేలా చూడాలని కోరారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు వెబ్ సైట్ లో ఉన్న ఆస్తులు ఎంత అన్నది ఐదు రోజుల లోపు అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

    తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ విదేశాల నుంచి వెంకన్న స్వామికి భారీగా నగదు, కానుకలు వస్తుంటాయి. వీటికి తోడు స్వామి వారి పేరుతో భారీగా ఆస్తులు ఉన్నాయి. అందుకే తిరుమల ఆస్తులు వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వం తీరుపై అనుమానాలతో పలువురు కోర్టును ఆశ్రయించారు. గతంలో  టీటీడీ బోర్డు తీర్మానించిన 50 ఆస్తులను వేలం వేయకుండా మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆపిందని.. మిగిలిన ఆస్తులను విక్రయించే ప్రమాదం ఉందని విపక్షాలు, హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. భవిష్యత్తులో టీటీడీ ఆస్తులను వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు కొందరు. దీనిపై మరోసారి విచారించిన హైకోర్టు కీలక ఉత్వర్వులు జారీ చేసింది.

    ఆస్తుల విక్రయం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. భూముల విక్రయానికి సంబంధించి ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక వేత్తలతో సంప్రదింపులు జరిపేంత వరకు విక్రయ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  కానీ విపక్షాలు, ధార్మిక సంఘాలు మాత్రం ప్రభుత్వం తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తునే ఉన్నాయి.
    Published by:Nagesh Paina
    First published: