హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Amaravati: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి.. పోలీసులకు ఆదేశాలు

Amaravati: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి.. పోలీసులకు ఆదేశాలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Amaravati: అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పరిమిత ఆంక్షలతో పాదయాత్రను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Hyderabad

పాదయాత్ర చేసి తీరుతామని అమరావతి రైతులు (Amaravati).. అనుమతి ఇవ్వలేమని పోలీసులు (AP Police).. మరి ఏం జరుగుతుంది? అమరరావతి రైతుల పాదయాత్ర (Amatavati Farmers Padayatra) ప్రారంభమవుతుందా? లేదా..? అనే గందరగోళం మధ్య హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పరిమిత ఆంక్షలతో పాదయాత్రను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అమరావతి పరిరక్షణ సమితి (Amaravati Parirakshana Samiti) పాదయాత్రకు పోలీసులు వెంటనే అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.చంద్రబాబు ఆస్తుల గురించి మీకెందుకు..? లక్ష్మీపార్వతికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
అమరావతి రైతు ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా ఈ నెల 12న మహాపాదయాత్రను అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన విషయం తెలిసిందే. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి (Amaravai to Arasavilli) వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దానికి అనుమతి కోరుతూ ఇటీవలే ఏపీ డీజీపికి లేఖ రాశారు. ఐతే ఆ లేఖపై స్పందించిన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP Rajendranath Reddy).. రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని అన్నారు. యాత్ర సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున.. అనుమతి ఇవ్వలేమని గురువారం అర్ధరాత్రి ఉత్వర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు. ఈ క్రమంలో తమ పాదయాత్రకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ.. హైకోర్టు (AP High Court)లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు శుక్రవారం ఉదయం మొదటికేసుగా విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపించారు.


ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. పలు ఆంక్షలతో పాదయాత్రను నిర్వహించుకోవచ్చని తెలిపింది. పాదయాత్ర అనుమతి కోసం పోలీసులకు ఈరోజే దరఖాస్తు చేసుకోవాలని అమరావతి రైతులకు న్యాయస్థానం సూచించింది. రైతుల దరఖాస్తును పరిశీలించి వెంటనే అనుమతులివ్వాలని ఏపీ పోలీసుశాఖను హైకోర్టు ఆదేశించింది. ఐతే పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది. వారందరికీ ఐడీ కార్డులను జారీ చేయాలని పోలీసులకు సూచించింది. ఆ ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే పాదయాత్రలోకి అనుమతించాలని స్పష్టం చేసింది. ఇక అరసవెల్లిలో పాదయాత్ర ముగింపు సభకు పోలీసుల నుంచి ముందుస్తు అనుమతి తీసుకోవాలని అమరావతి పరిరక్షణ సమితిని ఆదేశించింది. యాత్రకు అనుమతి రావడంతో.. పాదయాత్ర ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు.

First published:

Tags: Amaravati, Andhra Pradesh, AP News

ఉత్తమ కథలు