Home /News /andhra-pradesh /

AP HIGH COURT WILL GO FOR DAILY HEARING OF CASES OF AMARAVATI CAPITAL FROM SEPTEMBER 21 AK

రాజధాని పిటిషన్ల విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు నేటితో ముగిశాయి. అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ స్టేటస్ కో వచ్చే నెల 21 వరకు కొనసాగనుంది.

    రాజధాని తరలింపు సహా ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లపై వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు తెలిపింది. రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏమిటని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

    కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. అయితే కేవలం వీవీఐపీల కోసమే ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని చేపడుతోందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై సెప్టెంబరు 10వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇక రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు నేటితో ముగిశాయి. అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ స్టేటస్ కో వచ్చే నెల 21 వరకు కొనసాగనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amaravati, AP High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు