Home /News /andhra-pradesh /

AP HIGH COURT SUSPENDS GOVERNMENT R5 ZONE NOTIFICATION AK

ఏపీ హైకోర్టులో వైసీపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజధానిలో ఆర్‌5 జోన్‌ ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

    అమరావతి ప్రాంతంలోని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించంపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధానిలో ఆర్‌5 జోన్‌ ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ ఫ్లాన్‌లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను సీఆర్డీఏలోని సెక్షన్‌ 41 ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ని మార్పు చేయాలంటే.. స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. వేసవి సెలవుల తర్వాత జూన్‌ 17కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

    అంతకుముందు అమరావతి ప్రాంతంలో ఆర్‌5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల వారితోపాటు గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలకు చెందిన వారికి స్థలాలు ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకోసం ఆర్5ను ప్రభుత్వం సృష్టించింది. అయితే దీనిపై రాజధాని ప్రాంత రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు ఆశ్రయించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amaravati, Ap cm ys jagan mohan reddy, AP High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు