Home /News /andhra-pradesh /

AP HIGH COURT STAYS FIR ON DR RAMESH IN SWARNA PALACE FIRE ACCIDENT SK

హైకోర్టులో జగన్ సర్కార్‌కు మరో షాక్.. డాక్టర్ రమేష్‌కు ఊరట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు.

    హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో డాక్టర్ రమేష్‌పై దాఖలైన ఎఫ్ఐఆర్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌పై హైకోర్టు స్టే విధించింది. డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. డాక్టర్ రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అసలు స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలకు ఎందుకు బాధ్యులను చేయలేదన్న ఈ సందర్భంగా ప్రశ్నించింది. కేసులో అధికారులను నిందితులకు చేరుస్తారా? అని ప్రశ్నించించింది. ఇందులో అధికారుల తప్పు కూడా ఉందని.. ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు స్పష్టం చేసింది.

    ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగింది. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: AP High Court, AP News, Fire Accident, Vijayawada, Vijayawada Fire Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు