ఏపీ బీజేపీ నేతకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఆదినారాయణరెడ్డికి 1+1 భద్రతను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది.

news18-telugu
Updated: August 12, 2020, 11:10 AM IST
ఏపీ బీజేపీ నేతకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఆదినారాయణరెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదినారాయణరెడ్డికి 1+1 భద్రతను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది. ఈ విషయంలో జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాణహాని లేనప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తనకు భద్రతను పునరుద్ధరించాలని ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... పలువురు నేతలకు కల్పిస్తున్న భద్రతపై సమీక్షించింది. కొందరు నేతలకు కల్పించే సెక్యూరిటీని కుదించగా... మరికొందరు నేతలకు భద్రతను పూర్తిగా తొలగించింది.
Published by: Kishore Akkaladevi
First published: August 12, 2020, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading