AP HIGH COURT SLAMS EAST GODAVARI SP IN LAWYER SUBHASH CHANDRABOSE CASE SK
ఖాకీ చొక్కా వదిలి ఖద్దర్ వేసుకోండి.. ఎస్పీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఏపీ హైకోర్టు
పోలీసులు ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడానికన్న విషయం గుర్తుంచుకోవాలని.. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతోందా అని ఎస్పీని ప్రశ్నించింది.
లాయర్ సుభాష్ చంద్రబోస్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసులకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఖాకీ చొక్కా విడిచి ఖద్దర్ వేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా లాయర్ సుభాష్ చంద్రబోస్ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులపై కోర్టు మండిపడింది. ఆధారాలు లేకుండా అర్ధరాత్రి ఏ విధంగా ఇంట్లోకి చొరబడతారు? అలా వెళ్లడానికి ఏమైనా అధికారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పోలీసులు ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడానికన్న విషయం గుర్తుంచుకోవాలని.. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతోందా అని ఎస్పీని ప్రశ్నించింది.
కాగా, ఆదివారం అర్ధరాత్రి తన భర్త సుభాష్ చంద్రబోస్‌ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని పి.వెంకట ప్రియదీప్తి అనే మహిళ సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి తన భర్తను దౌర్జన్యంగా తీసుకెళ్లారని.. తన మామ పైలా సత్యనారాయణ గతంలో ఏలేశ్వరం మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్నారు. బోస్‌కు అధికార పార్టీ నేతలతో రాజకీయ విభేదాలున్నాయని ఆమె చెప్పారు. గతంలో పోలీసులు బెదిరించడంతో ఆయన జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని పిటిషన్లో వివరించారు.
ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రత్తిపాడు సీఐ, ఏలేశ్వరం ఎస్ఐలు, కానిస్టేబుళ్లు బలవంతంగా ఇంట్లోకి వచ్చి తన భర్తను దౌర్జన్యంగా తీసుకెళ్లారని వెంకట ప్రియదీప్తి తెలిపారు. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నారో, ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పకుండా దురుసుగా ప్రవర్తించారని వాపోయారు.తన భర్తను కోర్టులో హాజరు పరచాలని, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.