AP HIGH COURT SERIOUS ON DGP GAUTAM SAWANG REGARDING CHANDRABABU NAIDU ARREST IN VISAKHAPATNAM AK
డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఏపీ హైకోర్టు సీరియస్...
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హైకోర్టు
విశాఖలో చంద్రబాబుకు సీఆర్పీసీ 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ప్రశ్నించారు.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై హైకోర్టు సీరియస్ అయ్యింది. విశాఖలో చంద్రబాబుకు సీఆర్పీసీ 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ప్రశ్నించారు. సీఆర్పీసీ 151 ఆర్డర్‌ను చదివారా అని డీజీపీని అడిగింది. అయితే కోర్టు ఆదేశిస్తే పోలీసులపై చర్యలు తీసుకుంటామని... కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున చర్యలు తీసుకోలేదని గౌతమ్ సవాంగ్ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి... ముందు వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆరు గంటల పాటు న్యాయస్థానంలో వేచి చూశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.