news18-telugu
Updated: November 27, 2020, 8:19 PM IST
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై హైకోర్టు (Andhra Pradesh High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని అమరావతిలో (Amaravati) దళిత రైతుల మీద కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం (SC ST Cases on Dalit Farmers) ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రైతుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని 18 రోజుల పాటు జైల్లో ఉంచడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఇది రైతుల ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. అరెస్ట్ చేసేందుకు సరైన కారణాలు చూపించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కారం (Contempt of Court) కింద తీసుకొనే అధికారం కోర్టుకు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసులు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, వారే ఇలా చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాని న్యాయస్థానం ప్రశ్నించింది. పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్ పై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా అయితే రూల్ ఆఫ్ లా (Rule of Law) ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది.
Gold Rates: మంచిరోజులు వచ్చాయ్.. భారీగా పడిపోయిన బంగారం ధరలుAP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్, డిసెంబర్ నుంచి..
ఆంధ్రప్రదేశ్లోని అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు 300 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. అయితే, అదే సమయంలో మూడు రాజధానులు ఉండాలంటూ మరికొందరు అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారిని రాజధానిలో కొందరు రైతులు అడ్డుకున్నారు. కృష్ణాయపాలెంలో ఈ ఘటన జరిగింది. దీంతో తమను రైతులు అడ్డుకున్నారంటూ మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న రైతులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణాయపాలెం రైతుల మీద పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అయితే, నిందితులు కూడా దళితులే. కానీ, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం వివాదాస్పదమైంది. అదే సమయంలో తమను అడ్డుకున్న వారిపై పెట్టిన కేసులను మూడు రాజధానులకు అనుకూలంగా ఉండేవారు విత్ డ్రా చేసుకున్నారు. కానీ, పోలీసులు మాత్రం కేసులు కొట్టేయలేదు. ఆ తర్వాత అమరావతిలో రైతులకు బేడీలు వేసి మరీ జైలుకు తరలించడం పెనుదుమారానికి దారి తీసింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 27, 2020, 8:00 PM IST