హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: మీ పాదం చదునుగా ఉంటే.. ఆ ఉద్యోగానికి అనర్హులే.. హైకోర్టు కీలక తీర్పు..

AP News: మీ పాదం చదునుగా ఉంటే.. ఆ ఉద్యోగానికి అనర్హులే.. హైకోర్టు కీలక తీర్పు..

APPSC: ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే మంచి సబ్జెక్ట్ అవసరం. ఫిట్ నెస్ తో సంబంధమున్న ఉద్యోగాలకు మరింత ఫిట్ గా ఉండాలి. చిన్నతేడా ఉన్నా జాబ్ కు సెలెక్ట్ చేయరు. ఐతే యువకుడిలో ఉన్న చిన్న లక్షణం అతడికి శాపంగా మారింది.

APPSC: ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే మంచి సబ్జెక్ట్ అవసరం. ఫిట్ నెస్ తో సంబంధమున్న ఉద్యోగాలకు మరింత ఫిట్ గా ఉండాలి. చిన్నతేడా ఉన్నా జాబ్ కు సెలెక్ట్ చేయరు. ఐతే యువకుడిలో ఉన్న చిన్న లక్షణం అతడికి శాపంగా మారింది.

APPSC: ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే మంచి సబ్జెక్ట్ అవసరం. ఫిట్ నెస్ తో సంబంధమున్న ఉద్యోగాలకు మరింత ఫిట్ గా ఉండాలి. చిన్నతేడా ఉన్నా జాబ్ కు సెలెక్ట్ చేయరు. ఐతే యువకుడిలో ఉన్న చిన్న లక్షణం అతడికి శాపంగా మారింది.

  ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే మంచి సబ్జెక్ట్ అవసరం. ఫిట్ నెస్ తో సంబంధమున్న ఉద్యోగాలకు మరింత ఫిట్ గా ఉండాలి. చిన్నతేడా ఉన్నా జాబ్ కు సెలెక్ట్ చేయరు. ఐతే యువకుడిలో ఉన్న చిన్న లక్షణం అతడికి శాపంగా మారింది. అన్ని అర్హతలున్నా శరీరంలోని చిన్న తేడా ఉద్యోగాన్ని దూరం చేసింది. చివరికి కోర్టుకెళ్లినా అతడికి న్యాయం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి 2018లో ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో కడప జిల్లా (Kadapa District) రాయచోటికి చెందిన నల్లమల నాగేశ్వరయ్య దరఖాస్తు చేసుకున్నాడు. 2019లో నిర్వహించిన నాగేశ్వరయ్య 300 మార్కులకు గానూ 194.26 మార్కులు వచ్చాయి. మెరిట్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ సాధించాడు.

  శారీరకంగానూ ఫిట్ గా ఉండటంతో ఇక జాబ్ గ్యారెంటీ అని భావించాడు. కానీ మెడికల్ టెస్ట్ రిజల్ట్స్ లో అతడి పేరులేదు. అందుకుకారణం అతడి కుడిపాదం చదునుగా ఉండటంతో ఎంపిక చేయలేదని అధికారులు చెప్పారు. దీంతో షాక్ కు గురైన నాగేశ్వరయ్య.. నోటిఫికేషన్ తో పాటు అందుకు సంబంధించిన జీవోలను హైకోర్టులో సవాల్ చేశారు. ప్రభుత్వం చెప్పిన రూల్స్ అన్నీ ఏపీ రవాణా శాఖ బసార్డినేట్ సర్వీస్ రూల్స్ కు, దివ్యాంగుల చట్టానికి విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నాడు. దీనపై హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

  ఇది చదవండి: ఏపీలో మరోకొత్త జిల్లా..? సీం జగన్ ఆలోచన.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

  పాదంలో చిన్న వైకల్యం కారణంగా వివక్ష చూపడానికి వీల్లేదని నాగేశ్వరయ్య తరపు న్యాయవాది వాదించారు. ఐతే ఏపీపీఎస్సీ తరపు న్యాయవాదులు ఫ్లాట్ ఫుట్ వైకల్యం కాదని, పైగా నాగేశ్వరయ్య ఆ చట్టం కింద రిజర్వేషన్ కూడా కోరలేదని వాదించారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఫ్లాట్ ఫుట్ ఉన్నవారు ఏఎంవీఐ పోస్టుకు అర్హులు కాదని అందుకే నాగేశ్వరయ్యను ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. అంతేకాదు ఏఎంవీఐ, ఎంవీఐ, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ వంటి పోస్టులకు ప్రమోషన్ ద్వారా గానీ, ప్రత్యక్ష నియామకం ద్వారాగానీ దివ్యాంగుల రిజర్వేషన్ మినహాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా కోర్టుకు సమర్పించారు.

  ఇది చదవండి: ఏపీలో పెరిగిన భూముల ధరలు.. కొత్త జిల్లాల తర్వాత సర్కార్ నిర్ణయం

  రిజర్వేషన్‌ను మినహాయించొచ్చు

  ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. ఉద్యోగ స్వభావాన్ని బట్టి రిజర్వేషన్‌ను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇదే విషయాన్ని దివ్యాంగుల చట్టం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. ఫ్లాట్ ఫుట్ అనేది వైకల్యం కానప్పటికీ ఏఎంవీఐగా అనర్హుడని తేల్చడం చట్టవిరుద్ధమంటూ పిటిషనర్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఐతే ఫ్లాట్ ఫుట్ కారణంగా నడవడం, పరిగెత్తే సమయంలో కాలికి పట్టు ఉండదని అందుకే విధుల్లో అడ్డంకి అవుతుందనే ప్రభుత్వం ఈ నిబంధన తెచ్చిందని.. కాబట్టి పిటిషనర్ దానిని చట్టవిరుద్ధమనలేరు అని కోర్టు పేర్కొంది.

  First published:

  Tags: Andhra Pradesh, AP High Court, APPSC

  ఉత్తమ కథలు