AP HIGH COURT SAYS DOCTOR SUDHAKAR CAN DISCHARGE FROM HOSPITAL AK
డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
డాక్టర్ సుధాకర్(ఫైల్ ఫోటో)
డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ అయ్యేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి తీసుకుని డాక్టర్ సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని కోర్టు తెలిపింది.
డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ అయ్యేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి తీసుకుని డాక్టర్ సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని కోర్టు తెలిపింది. సీబీఐ విచారణకు సహకరించాల్సిందిగా సుధాకర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిపై వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం మరో తీర్పును కూడా వెల్లడించింది. డాక్టర్ సుధాకర్‌ను బంధువులకు అప్పగించాలని ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నర్సీపట్నం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో సీబీఐ అధికారులు సమాచారం సేకరించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన డాక్టర్ సుధాకర్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.