ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ హఠాన్మరణం...

ఆంధప్రదేశ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ గుండెపోటుతో మృతి చెందారు.

news18-telugu
Updated: June 24, 2020, 7:35 PM IST
ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ హఠాన్మరణం...
ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధప్రదేశ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ గుండెపోటుతో మృతి చెందారు. హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన ఇన్చార్జీ రిజిస్ట్రార్ జనరల్ గా ఉన్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు. ఆమె చార్జీ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ మరణించడం గమనార్హం.
First published: June 24, 2020, 7:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading