ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకు షాక్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

news18-telugu
Updated: January 27, 2020, 8:34 PM IST
ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకు షాక్...
ఏపీ హైకోర్టు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా పడింది.

Ap high court, ysrcp, tdp, ycp colors, government offices, ఏపీ హైకోర్టు, వైసీపీ, టీడీపీ, వైసీపీ రంగులు, ప్రభుత్వ కార్యాలయాలు
ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు


ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీకి సంబంధించిన రంగులను వేస్తోంది. ఓసారి జాతీయ జెండాను కూడా చెరిపివేసి అక్కడ కూడా వైసీపీ రంగులు వేయడం వివాదాస్పదమైంది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే వాటిని చెరిపివేయించారు. అదే సమయంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దిమ్మెకు కూడా రంగులు వేశారంటూ ప్రచారం జరిగింది. దీనిపై కూడా వివాదం చెలరేగింది.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు