హైకోర్టు ఆదేశం... 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎవరి మీద అయినా కేసులు నమోదు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

news18-telugu
Updated: May 28, 2020, 7:37 PM IST
హైకోర్టు ఆదేశం... 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు...
ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు, నిబంధనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద... ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలను, నిబంధనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నందున, ప్రతి ఒక్కరికీ సీరియస్ నెస్ వుండాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే లాక్ డౌన్ నిబంధనలను పాటించకపోవడం, ఆంక్షలను ఉల్లంఘించడం దాఖలైన ఫిర్యాదులపై హైకోర్టు విచారించింది. వైసీపీకి చెందిన ఓ మంత్రితోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ సమయంలో యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో మొత్తం ఎనిమిది వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీంతో లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎవరి మీదైనా కేసు నమోదు చేయాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో.. వారి మీద డిజాస్టర్ మేనేజ్ మెంట్ వారికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. ఫిర్యాదు తీసుకుని తద్వారా వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిలపై కేసులు నమోదు కానున్నాయి.
First published: May 28, 2020, 7:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading