AP HIGH COURT ORDERED STAY ON CID CASES ON SEC EMPLOYEES AFTER HEARING ON NIMMAGADDA RAMESH KUMAR PETITION AK
జగన్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు
ప్రతీకాత్మక చిత్రం
Nimmagadda Ramesh kumar: కేసుల నమోదు కారణంగా ఉద్యోగులు తమ విధులను నిర్వహించలేకపోతున్నారని ఎస్ఈసీ రమేష్ కుమార్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో కేంద్ర హోంశాఖకు వ్రాసిన లేఖకు సంబంధించి సీఐడి నిర్వహిస్తున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. రమేష్‌కుమార్ రాసిన లేఖ వాస్తవానికి ఆయన రాయలేదని, ఇతరులు తయారు చేసిన లేఖను ఆయన పంపారని వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉద్యోగులను సీఐడీ అధికారులు విచారించారు. కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు. కేసుల నమోదు కారణంగా ఉద్యోగులు తమ విధులను నిర్వహించలేకపోతున్నారని ఎస్ఈసీ రమేష్ కుమార్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారనే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.