Home /News /andhra-pradesh /

AP HIGH COURT ORDERED STAY ON CID CASE AGAINST CHANDRABABU NAIDU REGARDING AMARAVATI LANDS ISSUE AK

Chandrababu Naidu: చంద్రబాబుకు భారీ ఊరట.. సీఐడీ విచారణపై హైకోర్టు స్టే

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది.

    అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై జరుగుతున్న సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు దీనిపై విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. ఉదయం నుంచి చంద్రబాబు పిటిషన్లపై వాదనలు జరిగాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అయితే విచారణ తొలిదశలో వివరాలు చెప్పలేమని సీఐడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. అయితే సీఐడీ విచారణతో ఏకీభవించని హైకోర్టు.. ఈ కేసులో స్టే విధించింది.

    అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

    ఈనెల 13న చంద్రబాబుపే సీఐడీ కేసులు నమోదు చేయగా.. ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా అసలు విషయం బయటకి వచ్చింది. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచిన సీఐడీ.. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.

    ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి ఇరుపక్షాల వాదన విన్న హైకోర్టు.. ఈ కేసులో స్టే విధించింది. దీంతో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, Chandrababu naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు