ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు

సిట్, టీడీపీ హయాంలో పనులపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా పిటిషన్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: September 16, 2020, 11:59 AM IST
ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజధాని భూముల సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. సిట్, టీడీపీ హయాంలో పనులపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. సిట్ ఏర్పాటు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అమరావతి రాజధాని భూముల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని నిన్న ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కూడా కేసులు నమోదు చేసింది.

అంతకుముందు అమరావతి భూముల వ్యవహారం సహా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం విచారణ చేయించాలని నిర్ణయించడంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. అమరావతి రాజధాని నిర్ణయం తీసుకోవడానికి ముందే అక్కడ భూముల కొనుగోలు విషయంలో అవకతవకాలు జరిగాయాలని వైసీపీ ఆరోపించింది. దేశంలోనే ఇదో పెద్ద కుంభకోణమని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ జగన్ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. చంద్రబాబు, లోకేశ్ ఈ విషయంలో సీబీఐ విచారణను ఎదుర్కొవాలని సూచించింది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది.
Published by: Kishore Akkaladevi
First published: September 16, 2020, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading