జనసేన నేత పిటిషన్‌తో దుర్గగుడి ఈవో నియామకం రద్దు... హైకోర్టు ఆదేశాలు...

జనసేన అధికార ప్రతినిధి పోతిని మహేష్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: January 31, 2020, 10:14 PM IST
జనసేన నేత పిటిషన్‌తో దుర్గగుడి ఈవో నియామకం రద్దు... హైకోర్టు ఆదేశాలు...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం
  • Share this:
విజయవాడ దుర్గమ్మ ఆలయ ఈవో ఎంవీ సురేష్ బాబు నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. సురేష్ క్యాడర్ కంటే పై స్థాయి అధికారులకు ఇవ్వాల్సిన ఈవో పదవిని సురేష్‌కు అక్రమంగా కట్టబెట్టారని జనసేన అధికార ప్రతినిధి పోతిని వెంకట మహేష్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. సురేష్‌కు పోస్టింగ్ ఇవ్వడం కోసం నిబంధనలను అతిక్రమించి అతడికి ప్రమోషన్ ఇచ్చారని మహేష్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో ఏకీభవించిన హైకోర్టు దుర్గ గుడి ఈవోగా సురేష్ నియామకాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే తగిన క్యాడర్ ఆఫీసర్‌ను ఈవోగా నియమించాలని ఆదేశించింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్గగుడి ఈవోగా ఉన్న ఐ ఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మను బదిలీ చేసి.. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ హోదాలో అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న ఎం.వి.సురేష్‌బాబును దుర్గ గుడికి ఈవోగా నియమిస్తూ గత ఏడాది ఆగస్టు 21న దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోటేశ్వరమ్మ ఇంకా రిలీ వ్‌ కాకుండానే గత ఏడాది ఆగస్టు 21న రాత్రికి రాత్రే సురేష్‌బాబు ఆఘమేఘాలపై వచ్చి దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించడం అప్పట్లో చర్చనీయాంశ మైంది.

ప్రతి సంవత్సరం రూ.200 కోట్లకు పైగా ఆదాయం వస్తు న్న దుర్గగుడికి ఈవోగా దేవదాయ శాఖలో రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ హోదాలో ఉన్న అధికారిని మా త్రమే నియమించాల్సి ఉండగా.. డిప్యూటీ కమిషనర్‌ హోదాలో ఉన్న సురేష్‌బాబును రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద దేవస్థానానికి ఈవోగా ఎలా నియమిస్తారనే వాద న తెరపైకి వచ్చింది. అర్హతలు లేని సురేష్‌బాబును దుర్గగుడి ఈవోగా నియమించడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందని, ఆయన ఒత్తిడికి తలొగ్గిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు నిబంధనలను తుంగలో తొక్కి సురేష్‌బాబును దుర్గగుడి ఈవోగా నియమించారనే విమర్శలు వెల్లువెత్తాయి.

దీనిపై జనసేన అధికార ప్రతినిధి పోతిని మహేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో దేవదాయ శాఖ దిద్దు బాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈవో అర్హతలపై కోర్టులో వాదోపవా దాలు జరుగుతున్న నేపథ్యంలో ఈవో సురేష్‌బాబు అర్హతలను పెంచేందుకు జాయింట్‌ కమిషనర్‌గా తాత్కాలిక పదోన్నతి కల్పించింది. అయితే, హైకోర్టు ఈ నియామకాన్ని తప్పుపట్టింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 31, 2020, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading