AP High court on Amaravati: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravathi) పై ఏపీ హైకోర్టు (AP High court) సంచలన తీర్పు ప్రకటించింది. రాజధాని రైతులకు భారీ ఊరట ఇస్తూనే.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా ఉంది తీర్పు.. కీలకమైన స్టేట్ మెంట్స్ ఇచ్చింది హైకోర్టు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్టైంది. ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు తాజాగా వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఏపీ ప్రభుత్వం (AP Government) వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అమరావతిలో అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని.. అలాగే ఆరు నెలల్లోనే పూర్తి అభివృద్ధి చేయాలని సూచించింది.
తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. రైతులు ఇచ్చిన భూములను రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికి.. తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలతో భవిష్యత్తులో రాజధానిని మార్పు చేసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. తాజా తీర్పును పరిశీలిస్తే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని. మూడు నెలల్లోపు రైతులకు ప్లాట్లు నిర్ణయించాలి. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్పులో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని కోర్టు క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.
ఇదీ చదవండి: భీమ్లా నాయక్ కు టీడీపీ మద్దతు అందుకేనా..? 2019 ఎన్నికలకు ఇప్పటికీ తేడా ఏంటి..?
అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని చెప్పడం కూడా ప్రభుత్వానికి షాక్ లాంటిదే.. అలాగే పిటిషనర్లందరికీ ఖర్చుల కింద 50 వేల రూపాయలు చెల్లించాలని హైకోర్టు పేర్కొంది.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిందే అని హైకోర్టు చెప్పడం ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తాజా తీర్పుపై రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. అమరావతినే రాజధాని అని కోర్టు స్పష్టం చేసిందని.. ఇక ప్రభుత్వం మారినా రాజధానిని మార్చే అవకాశం లేదని అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. టీడీపీకి వచ్చే స్థానాలు ఇవే అంటూ సంచలన వ్యాఖ్యలు
అయితే తాజా తీర్పుపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై ఇప్పటికే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.. రాజధాని తరలించకూడదని కోర్టు స్పష్టమైన సూచనలు చేయడంతో.. ఎలా ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవు అన్నదానిపై ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టు సమాచారం.. కోర్టు తీర్పు కాపీ అందిన తరువాత అధికారికంగా దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP High Court, AP News