• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • AP HIGH COURT NOTICES TO 49 MEMBERS INCLUDING YSRCP MP NANDIGAM SURESH AND EX MLA AMANCHI KRISHNA MOHAN AK

వైసీపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా 49 మందికి నోటీసులు...

వైసీపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా 49 మందికి నోటీసులు...

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. దీనిపై గతంలోనే రిట్ పిటిషన్ దాఖలైనందున పిల్ అవసరం లేదని తెలిపింది. పిల్ వేయడంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది

  • Share this:
    హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో 49 మందికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన వారిలో వైసీపీ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. హైకోర్టు జడ్జీలను కించపరిచేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు పలువురు వైసీపీ నేతలు కోర్టు ఇచ్చిన తీర్పులను తప్పుబట్టే విధంగా మాట్లాడారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టిన ఏపీ హైకోర్టు... 49 మందికి నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది లక్ష్మీ నారాయణ... వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు