హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Housing Scheme: ఏపీలో ఇళ్ల పథకానికి లైన్ క్లియర్.. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు..

AP Housing Scheme: ఏపీలో ఇళ్ల పథకానికి లైన్ క్లియర్.. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు..

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకానికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు, పేదలందరికీ ఇళ్ల పథకాలకు హైకోర్టు (High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ల పథకానికి బ్రేకులేస్తూ సింగిల్ జడ్జి తీర్పును డివిజనల్ బెంచ్ కొట్టేసింది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకానికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు, పేదలందరికీ ఇళ్ల పథకాలకు హైకోర్టు (High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ల పథకానికి బ్రేకులేస్తూ సింగిల్ జడ్జి తీర్పును డివిజనల్ బెంచ్ కొట్టేసింది. పథకాన్ని నిలిపేయాలంటూ కోర్టుకెక్కిన 52 మంది తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. పిటిషన్ వేసిన వారికి ఇదివరకే ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే పిటిషనర్లు కూడా తమకు పట్టాలందిన విషయాన్ని కోర్టకు తెలియజేశారు. ఇంకా ఇళ్లపట్టాలు రాని అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకున్న మూడు నెలల్లోగా ఇళ్లపట్టాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

  ఇదిలా ఉంటే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ఉద్దేశాలను సరిగ్గా అర్థంచేసుకోలేకపోయారని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాదనలను అంగీకరించిన కోర్టు.. ఈ కేసులనపై విచారణ ముగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా పేదలందరికీ ఇళ్ల పథకాన్ని నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్డ్ సింగిల్ జడ్జి.. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తీర్పునిచ్చారు. ఈ తీర్పును రాష్ట్రప్రభుత్వం సవాల్ చేయగా.. డివిజనల్ బెంచ్ తీర్పును కొట్టేసింది.

  ఇది చదవండి: జగనన్న విద్యాదీవెన నగదు జమ.. ఆ పరిస్థితి తీసుకురావొద్దన్న సీఎం


  ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని పేదలకు ఇళ్లస్థలాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 33 లక్షల మందికి స్థలాలను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున స్థలాలను ఇచ్చింది. వీటిని లబ్ధిదారుని కుటుంబంలోని మహిళల పేరిట మంజూరు చేసింది. ఈ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.1.80 లక్షల ఆర్ధిక సాయం చేస్తోంది. సొంతగా ఇళ్లు నిర్మించుకునేవారికి నగదు విడుదల చేస్తున్న ప్రభుత్వం..., అలా కాని పక్షంలో మెటీరియల్ సరఫరా చేస్తోంది. పథకం ప్రారంభించిన సమయంలో ప్రభుత్వమే పూర్తి ఇంటిని నిర్మించే ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం.. వివిధ కారణాలతో ఈ విధానాన్ని పరిమితం చేసింది.

  ఇది చదవండి: రాజకీయాల్లోకి ఆనందయ్య.. త్వరలో కొత్త పార్టీ..! బీసీలను పట్టించుకోవడం లేదని కామెంట్..


  రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఇళ్లు పునాదుల్లో ఉన్నాయి. 10శాతం లోపు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. గత నెలలో ప్రభుత్వ ఆదేశాలతో లబ్ధిదారులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సిద్ధం చేసిన లేఅవుట్లలో నీరు, కొద్దిపాటి రోడ్లు తప్ప పెద్దగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇళ్లు మెరక తోలకపోవడంతో నిలిచిపోయాయి. అలాగే మెజారిటీ లబ్ధిదారులు ఇంకా తమకు నిధులు విడుదల కాలేదని ఆరోపిస్తున్నారు. ఐతే ఇళ్ల నిర్మాణానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇకనైనా బిల్లులు విడుదలవుతాయని లబ్ధిదారులు భావిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP High Court, Housing lands for poor

  ఉత్తమ కథలు