Home /News /andhra-pradesh /

AP HIGH COURT GIVEN KEY ORDER TO CONTROL SANKRANTHI COCK FIGHT BETTINGS HSN

AP High Court: పోలీసు శాఖకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. నిర్వేదంలో లక్షలాది మంది ప్రజలు..!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ఫైల్ ఫొటో)

తెలంగాణలో దసరా పండుగను జరుపుకున్నంత ఘనంగా ఏపీలో సంక్రాంతికి మోతమోగిపోతుంది. అయితే ఈసారి సంక్రాంతిని మాత్రం ఆ ప్రాంత వాసులు ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కారణం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే. అదేంటి.? ఏపీ హైకోర్టు ఆదేశాలతో సంక్రాంతి జోష్ తగ్గడమేంటనుకుంటున్నారా..?

ఇంకా చదవండి ...
    సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఆంధ్రాలో అత్యంత ఘనంగా జరిగే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండక్కు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలతోపాటు  దేశ విదేశాలకు ఉన్నతోద్యోగాలకు వెళ్లిన తెలుగు వారంతా సొంతూళ్లకు వచ్చేస్తారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకుంటారు. అరిసెలు మొదలుకుని ఎన్నో రకాల పిండివంటలతో ప్రతి ఇల్లు ఘుమఘుమలాడిపోతుంది. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతాయంటేనే అర్థమవుతుంది, ఏపీ ప్రజలు ఆ పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటారో. తెలంగాణలో దసరా పండుగను జరుపుకున్నంత ఘనంగా ఏపీలో సంక్రాంతికి మోతమోగిపోతుంది. అయితే ఈసారి సంక్రాంతిని మాత్రం ఆ ప్రాంత వాసులు ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కారణం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే. అదేంటి.? ఏపీ హైకోర్టు ఆదేశాలతో సంక్రాంతి జోష్ తగ్గడమేంటనుకుంటున్నారా..?

    సంక్రాంతి పండుగ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవాటిల్లో పిండివంటలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, నాన్ వెజ్ వంటకాలు ఉంటాయి. వీటితోపాటు విలాసరాయుళ్లు ఎక్కువగా పాల్గొనే కోడి పందేలు పేరు కూడా ప్రతీ ఊళ్లో వినిపిస్తుంది. యూత్ అంతా దాదాపు కోడి పందేల దగ్గరే ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. గోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులే దగ్గరుండి మరీ ఈ కోడిపందేలను నిర్వహిస్తుంటారు. తెలంగాణ నుంచి రాజకీయ నేతలు కూడా కోడిపందేలను వీక్షించేందుకు వెళ్తారంటే దాని ప్రాధాన్యం ఎంత ఉందో వేరే చెప్పనక్కరలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.

    కోడి పందేల పేరుతో మూగ జీవాలను హింసించడం నేరమంటూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన షేక్ సలీం హైకోర్టు మెట్లెక్కారు. మూగ జీవాలను రక్షించాలని కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు, కోడి పందేలు నిర్వహించకూడదని 2016లోనే ఇచ్చిన ఆదేశాలను గుర్తుచేశారు. అదే సమయంలో ఈ సంక్రాంతికి రాష్ట్రంలో కోడి పందేలు జరగకుండా చూడాలని పోలీసు శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోడి పందేలు నిర్వహించకూడదని 2016లోనే తాము ఆదేశాలు జారీ చేసినా, ఆ తర్వాత కూడా కోడి పందేలు జరిగాయని కోర్టు స్పష్టంచేసింది. తమ ఆదేశాలను పోలీసులు పాటించలేదనీ, ఇదికోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెలిపింది. గతంతో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులతో కలిసి దీన్ని కూడా విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. దీంతో ఈసారి కోడి పందేల నిర్వహణకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలతో సంక్రాంతి జోష్ తగ్గేలా ఉందని పందెం రాయుళ్లు దిగాలుపడుతుండటం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: AP High Court, AP Police, Betting, Cock fight, Sankranti

    తదుపరి వార్తలు