AP HIGH COURT ALLOWS TO ENQUIRE RAMESH BABU IN SWARNA PALACE FIRE ACCIDENT SU
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం.. డాక్టర్ రమేష్ బాబు విచారణకు అనుమతించిన హైకోర్టు
AP High Court: ఏపీ హైకోర్టు
విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నీ ప్రమాదం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది.
విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్‌బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. రమేష్‌బాబును మూడు రోజుల పాటు న్యాయవాది సమక్షంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వరకు ఉదయం 10 గంటల నంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది.
ఇక, ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది కరోనాతో బాధితులు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగిందని అధికారులు నివేదకి సమర్పించారు. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
అయితే రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్‌బాబు అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. అలాగే ఈ ఘటన తర్వాత తనపైన నమోదైన కేసు కొట్టివేయాలని రమేష్ బాబు, చైర్మన్ ఎం.సీతారామ్మోహనరావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిపై తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా రమేష్‌బాబును విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసలు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.