హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Eluru Mystery Disease: ఏలూరు అంతు చిక్కని వ్యాధిపై వైద్య శాఖ మంత్రి కీలక ప్రకటన.. వ్యాధి నిర్ధారణ గురించి ఏమన్నారంటే..

Eluru Mystery Disease: ఏలూరు అంతు చిక్కని వ్యాధిపై వైద్య శాఖ మంత్రి కీలక ప్రకటన.. వ్యాధి నిర్ధారణ గురించి ఏమన్నారంటే..

ఏపీ మంత్రి  ఆళ్ల నాని

ఏపీ మంత్రి ఆళ్ల నాని

Eluru Mystery Disease: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఆ వ్యాధి ఏంటి? ఎలా వచ్చింది అన్న విషయం ఇంకా నిర్ధారణ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కీలక ప్రకటన చేశారు.

ఇంకా చదవండి ...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఆ వ్యాధి ఏంటి? ఎలా వచ్చింది అన్న విషయం ఇంకా నిర్ధారణ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కీలక ప్రకటన చేశారు. ఆ అంతు చిక్కని వ్యాధి ఏంటో నిర్ధారించేందుకు మరో 5 రోజుల సమయం పడుతుందని తెలిపారు. పూర్తి స్థాయి విశ్లేషణ అనంతరం తుది నివేదిక వచ్చాక అలాంటి నగరంలో శాశ్వత చర్యలు చేపడతామని చెప్పారు. ఏలూరులో అస్వస్థతకు గురైన బాధిత కుటుంబాలను మంత్రి శనివారం పరామర్శించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా వీధుల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వ్యాధికి గల కారణాలపై జాతీయ సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయని వెల్లడించారు. ఈ సంస్థలు తుది నివేదిక అందించిన అనంతరం వ్యాధికి కారణాలు వెల్లడిస్తామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఇదిలా ఉంటే.. ఏలూరు వింత వ్యాధి వెనక గల కారణాలకు సంబంధించి పలు రిపోర్ట్స్‌లో వెలువడుతున్న అంశాలు దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. ఏలూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేపిన ఈ వ్యాధి బారిన పడి దాదాపు 600కి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తొలుత కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చాయి. శుక్రవారం నాడు కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 613కు చేరింది. అందులో 13 మంది చికిత్స పొందతుడంగా, మిగతావారు డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ వింత వ్యాధికి గల గల స్పష్టమైన కారణం తెలియలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్టుగా పేర్కొంది.

వ్యాధి ప్రబలిన కొత్తలో నీటి కాలుష్యం వల్ల గానీ, వాయు కాలుష్యం వల్ల గానీ ఇలా జరిగి ఉండొచ్చని చాలా మంది భావించారు. అయితే తాజాగా వెలువడుతున్న పలు పరిశోధనలు నీటి, వాయు కాలుష్యం ప్రభావం అంతగా లేదని వెల్లడిస్తున్నాయి. బాధితులు తీసుకున్న ఆహారంలోనే పురుగుల మందు వంటి రసాయనాల అవశేషాలు ఉన్నట్టుగా పలు సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్టుగా ఎయిమ్స్ తన నివేదికలో తెలిపింది.

First published:

Tags: Alla Nani, Andhra Pradesh, Ap cm jagan, Eluru

ఉత్తమ కథలు