ఆన్‌లైన్‌లో ఏపీ సచివాలయ రాత పరీక్షల హాల్‌ టికెట్లు...

మొత్తం 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొత్తం 12.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

news18-telugu
Updated: August 24, 2019, 10:43 PM IST
ఆన్‌లైన్‌లో ఏపీ సచివాలయ రాత పరీక్షల హాల్‌ టికెట్లు...
నమూనా చిత్రం
  • Share this:
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించి హాల్‌ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్ లోనే హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఇప్పటికే సూచించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆన్‌లైన్‌ హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచారు. మొత్తం 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొత్తం 12.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఉదయం, సాయంత్రం వేళ్లలో రాతపరీక్షలు జరుగుతాయి. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం కావడంతో పరీక్షను మినహాయింపు ఇచ్చారు.

డౌన్ లోడ్ చేసుకునే లింక్‌లు ఇవే:

గ్రామ సచివాలయ హాల్ టికెట్స్: http://gramasachivalayam.ap.gov.in/ 

వార్డు సచివాలయ హాల్ టికెట్స్: http://wardsachivalayam.ap.gov.in/ 
First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు