రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్

వచ్చే ఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం జగన్. రైతులు పండించే 30 శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.

news18-telugu
Updated: May 26, 2020, 2:59 PM IST
రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్
సీఎం జగన్
  • Share this:
ఏపీ రైతులకు సీఎం వైఎస్ జగన్ మరో శుభవార్త చెప్పారు. ఈ ఖరీఫ్ నుంచే ఉచితంగా బోర్లు వేయిస్తామని తెలిపారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ఆయన.. రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. మే 25 నుంచి మే 30వ వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో రోజుకో అంశంపై చర్చిస్తున్నారు. మంగళవారం రెండో రోజులో భాగంగా వ్యవసాయంపై ప్రత్యేకంగా చర్చించారు సీఎం జగన్.


రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చాం. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల్లోపే భూమి ఉంది. అర్హులందరికీ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తున్నాం. నేరుగా రైతుల అకౌంట్లలోనే డబ్బులను జమచేశాం. కేవలం రైతుల కోసమే వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చాం. వడ్డీ కోసం రూ.2 వేల కోట్లను ఏపీ ప్రభుత్వమే కడుతుంది. ఈ ఖరీఫ్ నుంచి ఉచితంగా బోర్లు వేయిస్తాం.
వైఎస్ జగన్, ఏపీ సీఎం


ఇక వచ్చే ఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం జగన్. రైతులు పండించే 30 శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఆ పంటలను జనతా బజార్ల ద్వారా విక్రయిస్తామని.. ఆర్‌బీకేలలో ల్యాబ్‌లు, కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దళారీ వ్యవస్థను తొలగించేందుకు ఆర్‌బీకేల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు సీఎం జగన్.
First published: May 26, 2020, 2:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading