విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి పరిహారం ఈరోజు ఇచ్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రకటించిన విధంగా సాయం రేపు అందించాలని స్పష్టం చేశారు. మిగిలిన వారికి కూడా ప్రకటించిన విధంగా సహాయం అందించడానికి తగినన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గ్యాస్ లీక్ ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. బాధితులు కోలుకుంట్ను వైనం, వారికి చికిత్స అందుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.గాలిలో గ్యాస్ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని తెలిపారు. దీనిపై నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నారని వివరించారు. కంపెనీ సమీప గ్రామాల్లో స్టెరెన్ గ్యాస్ అవశేషాల తొలగింపునకు చేపడుతున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం... గ్రామాల్లో ముమ్మరంగా శానిటేషన్ జరపాలని ఆదేశించారు. అన్నిరకాల చర్యలను తీసుకున్న తర్వాతనే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని సీఎం ఆదేశించారు. విశాఖ కేజీహెచ్‌లో సీఎం జగన్ ప్రకటించిన ప్రకారం బాధితులకు పరిహారం కింద చెల్లించడానికి రూ.30 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.