Home /News /andhra-pradesh /

AP GOVT TO ANNOUNCE KEY DECISION ON SSC 10TH EXAMS BY TODAY EVENING SK

టెన్త్ పరీక్షలపై సాయంత్రం లోపు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో నిత్యం 400కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం తీరుపై జనసేన, టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని.. టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా? లేదా? ఈ ప్రశ్నకు నేడు సమాధానం వచ్చే అవకాశముంది. సాయంత్రం లోపు స్పష్టమైన ప్రకటన చేస్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం యథాతధంగా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామని.. దీనిపై సీఎం జగన్‌తోనూ చర్చించినట్లు ఆయన చెప్పారు. పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని.. సీబీఎస్ఈకి కేంద్రం కూడా గడువు ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి.


    జులైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కొన్ని రోజుల క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏపీ జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని కొన్ని రోజుల క్రిత ఆయన స్పష్టం చేశారు. క్రితం 11 పరీక్షల పేపర్లు ఉండగా ప్రస్తుతం 6 పేపర్లకు బోర్డ్ కుదించింది. జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్, జులై 11న సెకండ్‌ లాంగ్వేజ్, జులై 12న థర్డ్‌ లాంగ్వేజ్, జులై 13న గణితం, జులై 14 సామాన్య శాస్త్రం, జులై 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు జరగుతాయని తెలిపింది.

    కానీ ఏపీలో రోజు రోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం 400కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం తీరుపై జనసేన, టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని.. టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డుట్లు తెలుస్తోంది. ఐతే కరోనా కేసుల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే రద్దు చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు