news18-telugu
Updated: November 28, 2019, 10:02 PM IST
తాంత్రిక పూజలు
చిత్తూరు జిల్లా కాలభైరవ ఆలయలో తాంత్రిక పూజల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. గుడిలో తాంత్రిక పూజలు చేయుటకు సహకరించారని శ్రీకాళహస్తి ఏఈవో ఏకే ధనపాల్ను తాత్కాలిక విధుల నుంచి నిలుపుదల (సస్పెన్షన్) చేస్తూ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కాగా, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన క్షుద్రపూజలు కలకలం రేపాయి. శ్రీకాళహస్తికి సమీపంలోని వేడాంలో ఉన్న కాలభైరవ ఆలయంలో అర్థరాత్రి కొందరు క్షుద్రపూజలు చేశారు. తమిళనాడుకు చెందిన ఐదుగురు పూజలు చేసినట్లు స్థానికులు తెలిపారు.
క్షుద్రపూజల సంగతిని తెలుసుకున్న పోలీసులు ఐదుగురు తమిళనాడు వాసులను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంలో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అమావాస్య రోజున ఆలయంలో క్షుద్రపూజలు జరగడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 28, 2019, 9:58 PM IST