శంకుస్థాపనకు ముందే కడప స్టీల్ ప్లాంట్ చరిత్రాత్మక ఒప్పందం...

ఎన్ఎండీసీ ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని కడప స్టీల్ ప్లాంట్‌కు సరఫరా చేయనుంది.

news18-telugu
Updated: December 18, 2019, 10:40 PM IST
శంకుస్థాపనకు ముందే కడప స్టీల్ ప్లాంట్ చరిత్రాత్మక ఒప్పందం...
కడప స్టీల్ ప్లాంట్‌ - ఎన్ఎండీసీ మధ్య అవగాహన ఒప్పందం (File)
  • Share this:
శంకుస్థాపన జరగకముందే కడప స్టీల్ ప్లాంట్ కీలక ఒప్పందం చేసుకుంది. కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాపై ఒప్పందం కుదిరింది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ), ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (కడప స్టీల్ ప్లాంట్) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశారు. ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (కమర్షియల్‌) అలోక్‌కుమార్‌ మెహతా, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఎండీ పి.మధుసూదన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఎన్‌ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకమన్న సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఈ ఒప్పందం తోడ్పాటునందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ఎండీసీ ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని కడప స్టీల్ ప్లాంట్‌కు సరఫరా చేయనుంది.
ఉక్కు ఉత్పత్తి ఖర్చును తగ్గించే చర్యల్లో భాగంగా తొలివిడతలో ప్లాంటు సమీప ప్రాంతాల నుంచి ఐరన్‌ఓర్‌ను సరఫరా చేయనుంది. ఈనెల 23 లేదా 24న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కడప స్టీల్ ప్లాంట్ కోసం సుమారు 3వేల ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 18, 2019, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading