జులై 10 నుంచి 15 వరకువ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఎక్కువ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 పేపర్లను 6కు కుదించింది. అంటే పదో తరగతి విద్యార్థులు ఈసారి 6 పరీక్షలను మాత్రమే రాయాల్సి ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక వారీగా ఆరు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. గతంలో హిందీ, మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు రెండేసి పేపర్ల చొప్పున పరీక్షలు రాయాల్సి ఉండేది. అంటే మొత్తం 11 పరీక్షలు నిర్వహించే వారు. కానీ కరోనా లాక్డౌన్ వల్ల పరీక్షలు నిర్వహించడం కష్టమైన నేపథ్యంలో.. 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించింది ఏపీ విద్యాశాఖ.
ఇక జులై 10 నుంచి 15 వరకువ ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఎక్కువ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అంతేకాదు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని.. పరీక్ష పూర్తయ్యాక ప్రతి గదినీ శానిటైజ్ చేస్తామని స్పష్టం చేసింది.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
జులై 10 - తెలుగు
జులై 11- హిందీ
జులై 12- ఇంగ్లీష్
జులై 13-గణితం
జులై 14-సామాన్య శాస్త్రం
జులై 15-సాంఘిక శాస్త్రం
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.