రివర్స్ టెండరింగ్‌లో మరో సక్సెస్.. ఈ సారి రూ.68 కోట్లు ఆదా

తొలిదశ బిడ్డింగ్‌ కన్నా తక్కువ ధరకు కోట్ చేయడంతో ఏపీ ఖజానాకు రూ.67.81 కోట్లు ఆదా అయ్యాయి.

news18-telugu
Updated: December 11, 2019, 10:40 PM IST
రివర్స్ టెండరింగ్‌లో మరో సక్సెస్.. ఈ సారి రూ.68 కోట్లు ఆదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఐనప్పటికీ ప్రభుత్వ మాత్రం పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ పద్దతిని అవలంభించి భారీగా ప్రభుత్వ నిధులను ఆదా చేసింది. పోలవరం విషయంలో సక్సెస్ కావడంతో అదే ఫార్ములాను ఇతర ప్రభుత్వ ఒప్పందాల్లోనూ అప్లై చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా అల్తూరుపాడు రిజర్వాయర్‌ పనుల్లో  రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ మరోసారి విజయవంతమయ్యారు. ఈసారి మరో రూ.67.81 కోట్లు ఆదా చేశారు.

అల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ పను కోసం ఇటీవల టెండర్లను ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం.  అల్తూరుపాడు పనుల విలువ 253.77 కోట్లు. ఐతే ప్రాథమికంగా 8 కంపెనీలు టెండరింగ్‌లో పాల్గొన్నాయి. ఓ కంపెనీ 218.09 కోట్లకు కోట్ చేసి ఎల్‌-1 గా నిలిచింది. ఈ మొత్తానికి  రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఐతే ఈ సారి హైదరాబాద్‌కు చెందిన బీవీఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్స్‌ కేవలం రూ. 185.6 కోట్లకు కోట్ల (26.72 శాతం తక్కువ)కు కోట్‌ చేసి బిడ్‌ దక్కించుకుంది. తొలిదశ బిడ్డింగ్‌ కన్నా తక్కువ ధరకు కోట్ చేయడంతో ఏపీ ఖజానాకు రూ.67.81 కోట్లు ఆదా అయ్యాయి.

 

  
First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>