కాపు నేస్తం అమలుకు ఉత్తర్వులు.. ఏటా రూ.15వేలు.. ఇవే కండిషన్లు.

వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ఈ హామీని పొందపరచలేదు. ఐతే కాపు కులాల్లో ఉన్న పేద మహిళలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గతంలోనే సీఎం జగన్ చెప్పారు.


Updated: January 28, 2020, 10:29 PM IST
కాపు నేస్తం అమలుకు ఉత్తర్వులు.. ఏటా రూ.15వేలు.. ఇవే కండిషన్లు.
వైఎస్ జగన్
  • Share this:
కాపులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ కాపునేస్తం పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద కాపు మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలకు రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మేరకు మంగళవారం రాత్రి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం వర్తిస్తుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ఈ హామీని పొందపరచలేదు. ఐతే కాపు కులాల్లో ఉన్న పేద మహిళలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గతంలోనే సీఎం జగన్ చెప్పారు.

ఎవరు అర్హులంటే...?
కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలు.

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసు వారే అర్హులు.గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే.

3 ఎకరా లోపు పల్లం భూమి, 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న కుటుంబాలకు మాత్రమే.

కారు, ట్రాక్టర్ వంటి 4-వీలర్ వాహనాలు లేని దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు మాత్రమే వైఎస్సార్ కాపు నేస్తానికి అర్హులు.ప్రభుత్వ ఉద్యోగం కాపు మహిళలు పథకానికి అనర్హులు.

కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను కడుతున్నా ఆ ఫ్యామిలీలోని మహిళలకు పథకం వర్తించదు.

 
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు