APPSC పరీక్షల షెడ్యూల్ విడుదల

క్టోబర్ 22, 23, 24 తేదీల్లో అటవీ రేంజ్ అధికారి పోస్టుకు , అక్టోబర్ 24, 25 తేదీల్లో డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టుకు , నవంబర్ 20, 21, 22, 23 తేదీల్లో పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి.

news18-telugu
Updated: August 2, 2019, 9:17 AM IST
APPSC పరీక్షల షెడ్యూల్ విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నియామక రాత పరీక్షల నిర్వహణ తేదీల జాబితాను ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురువారం ప్రకటించింది. ఇంతకుముందు కొన్ని పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించగా.. ప్రధాన పరీక్షను నిర్వహించనుంది. మరికొన్నింటికి నేరుగా ఒకే పరీక్షను నిర్వహిస్తోంది.దీనికి సంబంధించిన పరీక్షల తేదీల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 22, 23, 24 తేదీల్లో అటవీ రేంజ్ అధికారి పోస్టుకు , అక్టోబర్ 24, 25 తేదీల్లో డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టుకు , నవంబర్ 20, 21, 22, 23 తేదీల్లో పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు, నవంబర్ 28, 29, 30 తేదీల్లో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు, 2020 జనవరి 19, 20, 22, 23 తేదీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక గెజిటెడ్ పోస్టుల పరీక్షల వివరాలకు వస్తే, సహాయ బీసీ, సాంఘిక, గిరిజిన సంక్షేమ అధికారి పోస్టులకు నవంబర్ 5, 6న పరీక్షలు జరగనున్నాయి. నవంబర్ 6వ తేదీన ఏపీ బీమా వైద్య సేవల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నవంబర్ 6,7 తేదీల్లో జిల్లా సైనిక సంక్షేమ అధికారి పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. పట్టణ, ప్రణాళిక విభాగం పోస్టులకు, సంచాలకుల పోస్టులకు, భూగర్భ జల సేవల విభాగంలో సహాయ కెమిస్టు పోస్టులకు నవంబర్ 6, 7 తేదీల్లో, పట్టణ ప్రణాళిక సహాయకుల పోస్టులకు నవంబర్ 6, 8 తేదీల్లో, మైనింగ్ రాయల్టీ ఇన్ స్పెక్టర్ టెక్నికల్ అసిస్టెంట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్టులకు నవంబర్ 6న పరీక్షలు జరగనున్నాయి.

నాన్ గెజిటెడ్ పోస్టలక కూడా పరీక్షల తేదీల్ని ఖరారు చేసశారు. నంబవర్ 25,27 తేదీల్లో టెక్నికల్ అసిస్టెంట్స్ (జియో ఫిజిక్స్) పోస్టులకు, నవంబర్ 26, 27 తేదీల్లో టెక్నికల్ అసిస్టెంట్స్ (హైడ్రో జియాలజీ) పోస్టులకు, టెక్నికల్ అసిస్టెంట్స్ (మైనింగ్, జియాలజీ) పోస్టులకు నవంబర్ 27న, నవంబర్ 26, 27 తేదీల్లోటెక్నికల్ అసిస్టెంట్ (పురావస్తు) పోస్టులకు, సంక్షేమ నిర్వాహకులు (సైనిక సంక్షేమ, ఉప సేవలు) పోస్టులకు నవంబర్ 27న పరీక్షలు జరుగనున్నాయి. ప్రభుత్వం పరీక్ష తేదీలు ప్రకటించడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పరీక్షల కోసం ఎన్నాళ్లుగా కోచింగ్స్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్నవారంతా.. పరీక్షా తేదీలు వెలువడటంతో ... సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: August 2, 2019, 9:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading