10వ తరగతి పరీక్షల నిర్వహణలో... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అయితే ఇక నుంచి రెండు పేపర్లలో ప్రతి దానిలోను 17.5 మార్కులు వస్తేనే ఉత్తీర్ణత అయినట్లు పరిగణించనున్నారు.

news18-telugu
Updated: August 18, 2019, 11:13 AM IST
10వ తరగతి పరీక్షల నిర్వహణలో... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
10 వ తరగతి పరీక్షలు నిర్వహణలో పలు మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పది మార్కులు బిట్ పేపర్ స్ధానంలో ఏకవాక్య సమాధానాలు రాసే విధంగా ప్రశ్నలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రతి సబ్జెక్టు రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణంచే వారు. అయితే ఇక నుంచి రెండు పేపర్లలో ప్రతి దానిలోను 17.5 మార్కులు వస్తేనే ఉత్తీర్ణత అయినట్లు పరిగణించనున్నారు.

ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలలోని పాఠశాలలన్నింటిలో ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ మార్పుల్ని వర్తింపచేయనుంది. టెన్త్‌లో మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పేపర్లు ఉంటాయి. సెకండ్‌ లాంగ్వేజ్‌ (తెలుగు/హిందీ) సబ్జెక్టులో ఒకే పేపర్‌ 100 మార్కులకు, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, థర్డ్‌ లాంగ్వేజ్‌, మాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ సబెక్టుల్లో రెండు పేపర్లుగా 50 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు