ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీపికబురు... మార్చి నుంచి..

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం తీపికబురు అందిస్తోంది. కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి ఇకపై ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పనిలేదు.

news18-telugu
Updated: February 28, 2020, 6:23 PM IST
ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీపికబురు... మార్చి నుంచి..
ఆంధ్రప్రదేశ్ మ్యాప్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం తీపికబురు అందిస్తోంది. కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి ఇకపై ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. గ్రామ సచివాయాల్లోనే కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామ సచివాలయాల నుంచే ఇకపై కుల ధృవీకరణ సర్టిఫికెట్లు జారీ కానున్నాయి. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, సర్టిఫికెట్లు, ఇంకొన్ని జాబితాలోలేని కులాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను డిప్యూటీ తహశీల్దార్‌స్ధాయి నుంచి జిల్లా కలెక్టర్‌ స్ధాయి వరకు మంజూరు చేసేవారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, సర్టిఫికెట్లు జారీ చేసే అధికారాలను గ్రామసచివాలయాలు, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అప్పగించనుంది. అయితే, ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల నిమిత్తం ఇచ్చే సర్టిఫికెట్లు మాత్రం తహశీల్దార్‌, ఆపైవారే మంజూరు చేస్తారు. నూతన విధానాన్ని మార్చి నెలాఖరు నుంచి అమల్లోకి తీసుకొచ్చే యోచనలో వున్న సర్కారు అందుకు కసరత్తును ముమ్మరం చేసింది.

First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు